గుంటూరు జిల్లా మేడికొండూరులో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేడికొండూరులో ఒక వర్గం వారు దశ దిన కర్మ జరుపుతుండగా ... అదే ప్రదేశంలో మరో వర్గం వారు మద్యం తాగుతూ కనిపించారు. ఇక్కడ మద్యం తాగొద్దని మెుదటి వర్గం వారు అభ్యంతర పెట్టేసరికి.... మాటా మాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించి ఇరు వర్గాలు వారు వెళ్లిపోయారు. గ్రామంలో గొడవలు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు.
ఇదీ చదవండీ...