ETV Bharat / state

ఉద్యోగం ఇప్పిస్తానని మోసం..లక్షా 80 వేలకు టోకరా - guntur spandana programme news

తాను టీసీఎస్​లో హెచ్​ఆర్​ అని... ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి.... లక్షా 80వేలు కట్టించుకుని మోసం చేశాడో వ్యక్తి. ఈ ఘటనపై బాధితుడు గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు.

He cheated Rs 80 lakh by saying that he would give up the job.
గుంటూరు స్పందన కార్యక్రమం
author img

By

Published : Oct 13, 2020, 1:34 PM IST

విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో బీటెక్(ఐటీ) చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో...తాను టి.సి.ఎస్​లో హెచ్​ఆర్​ అని....బ్యాక్ డోర్ ద్వారా జాబ్ ఇప్పిస్తానని చెప్పి.... లక్షా 80 వేలు కట్టించుకుని మోసంచేశాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు తగిన న్యాయం చేయాలని కోరుతూ..బాధితుడు గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు.

వివరాల్లోకి వెళితే...

గుంటూరు ఆర్టీసీ కాలనీలో నివాసముంటున్న ఓ యువకుడు విశాఖపట్నంలోని గీతం యునివర్సిటీ బీటెక్(ఐ.టి) చదివాడు. క్యాంపస్ సెలక్షన్​లో సెలెక్ట్ కాకపోవడంతో... హైదరాబాద్​లోని పంజాగుట్ట ప్రాంతంలో గది అద్దెకు తీసుకుని...ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో తన స్నేహితుడు శివకుమార్ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం మోర గ్రామానికి చెందిన మండా వెంకట రమేష్ తండ్రి మంచి వెంకట సత్యనారాయణ శాస్త్రి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను హైదరాబాద్​లోని టీసీఎస్ కంపెనీ సందు హెచ్ఆర్ మేనేజరుగా పని చేస్తున్నానని...అందులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి లక్షా 80వేలు కట్టించుకున్నాడు.

ఆ తరువాత ఉద్యోగం గురించి అడిగితే... తన పేరు మీద ఫేక్ ఆఫర్ లెటర్, కాల్ లెటర్ పంపినట్లు భాదితుడు చెప్పాడు. ఇదేంటి అని ఆడిగితే ఏదో తప్పు జరిగిందని..మరో 10 రోజుల్లో చేర్పిస్తానని నమ్మబలికాడు. జాబ్ ఆయన ఇప్పించు... లేదంటే కట్టిన డబ్బులు అయిన ఇవ్వమని అడిగితే... శాస్త్రి డబ్బులు ఇవ్వను, ఉద్యోగం రాదు నీ ఇష్టం వచ్చింది చేసుకో అని అసభ్యంగా మాట్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు.

మరో ముగ్గురిని..

తన లాగానే మరో ముగ్గరు అతనిని నమ్మి మోసపోయారని మిగిలిన ముగ్గురు దగ్గర రూ. 6 లక్షలు వరకు వసూలు చేసినట్లు బాధితుడు చెప్పాడు. నిందితుడు శాస్త్రిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరాడు. సోమవారం గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో బాధితుడు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.

ఇదీ చదవండి: ప్రేమ పేరుతో మోసాలు..పోలీసులకు ఇద్దరు యువతుల ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.