ప్రభుత్వ ఆస్తులు, భూముల అమ్మకాలపై హైకోర్టు ఈరోజు విచారణ జరిగింది. ప్రభుత్వ ఆస్తులు అమ్మకాల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త సురేశ్ బాబుతో పాటు.. మరికొన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వ ఆస్తులను విక్రయించే హక్కు ప్రభుత్వానికి ఉందంటూ జీపీ చేసిన వాదనపై.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
రాజ్యం వేరు, ప్రభుత్వం వేరన్న హైకోర్టు.. రాజ్యం శాశ్వతం, ప్రభుత్వం శాశ్వతం కాదంటూ స్పష్టం చేసింది. ఆస్తులు అమ్మే అంశంలో ప్రభుత్వానికి ఎంతవరకు అథారిటీ ఉందో పరిశీలించనున్నామని జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ కృష్ణమోహన్ తో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలపై ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయగా.. ఇరువాదనలు విన్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. విచారణను రేపటికి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: నిమ్మగడ్డ వ్యవహారం: తొలగింపు నుంచి తిరిగి నియమించేదాకా....