ETV Bharat / state

విజయసాయి రెడ్డిని విచారించాల్సిందే - హైకోర్టులో అప్పీలు చేసిన ఐసీఏఐ

నోటీసుల నిలిపివేత సరికాదన్న ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ ఎకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా - సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టులో ఐసీఏఐ అప్పీలు

ICAI Appealed Against YSRCP MP Vijayasai Reddy Verdict in Court
ICAI Appealed Against YSRCP MP Vijayasai Reddy Verdict in Court (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

ICAI Appealed Against YSRCP MP Vijayasai Reddy Verdict in Court : జగన్‌ అక్రమాస్తుల కేసులో రెండో నిందితుడు విజయసాయిరెడ్డికి విచారణ కోసం ఇచ్చిన నోటీసులను రద్దుచేస్తూ సింగిల్‌ జడ్జి వెలువరించిన తీర్పుపై ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ ఎకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ICAI) తెలంగాణ హైకోర్టులో అప్పీలు చేసింది. కేసు పూర్వాపరాలను పరిశీలించకుండా నోటీసులు రద్దుచేయడం సరికాదంది. వృత్తిపరమైన ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై విచారణకు హాజరుకావాలంటూ గత ఏడాది అక్టోబరు 23న విజయసాయికి ICAI నోటీసులిచ్చింది. వాటిని సవాలు చేస్తూ ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దాన్ని అనుమతిస్తూ సింగిల్‌ జడ్జి ఈ ఏడాది జులై 30న తీర్పు వెలువరించారు. ఈ తీర్పుపై ICAI అప్పీలు చేసింది.

'డీఎన్‌ఏ పరీక్ష చేయాల్సిందే' - శాంతి మొదటి భర్త సంచలన వ్యాఖ్యలు - ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్

సింగిల్‌జడ్జి ఉత్తర్వులను రద్దుచేయాలి : సాయిరెడ్డి పిటిషన్‌పై విచారణ తెలంగాణ హైకోర్టు పరిధిలోకి రాదన్న తమ వాదనను సింగిల్‌ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదంది. విజయసాయిరెడ్డి చెన్నై కార్యాలయం నుంచి విధులు నిర్వహించారని, ICAI ఆఫీసూ అక్కడే ఉందని, అందువల్ల ఆయన మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాల్సి ఉందని తెలిపింది. విజయసాయిపై విచారణ ప్రాథమిక దశలోనే ఉందని, ఆయనపై క్రమశిక్షణ కమిటీ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదంది. ఛార్టర్డ్‌ ఎకౌంటెంట్స్‌ చట్టం కింద 2007లో తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం విచారణ చేపడతామని చెప్పింది. ఒక సంస్థ విచారణ చేస్తుండగా 226 అధికరణ కింద హైకోర్టు జోక్యం చేసుకోరాదని పేర్కొంది. తమ ఉత్తర్వులపై అప్పీలు చేసుకోవడానికి అప్పీలేట్‌ అథారిటీ ఉండగా హైకోర్టును ఆశ్రయించరాదని స్పష్టం చేసింది. సింగిల్‌జడ్జి ఉత్తర్వులను రద్దుచేయాలని ఐసీఏఐ కోరింది.

షర్మిల సరైన పత్రాలు లేకుండా దొంగ సంతకాలతో షేర్లు మార్చారు: విజయసాయిరెడ్డి

సాయిరెడ్డిపై ఆరోపణలివే : వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఛార్టర్డ్‌ ఎకౌంటెంట్‌గా వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు ఐసీఏఐ క్రమశిక్షణ కమిటీ నిర్ధారించింది. జగన్‌కు, ఆయన గ్రూపు కంపెనీలకు ఆర్థిక సలహాదారుగా ఉంటూ ఛార్టర్డ్‌ ఎకౌంటెంట్‌ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ముడుపులను పెట్టుబడులుగా మళ్లించడంలో విజయసాయి కీలకపాత్ర పోషించారని పేర్కొంది. ఆయన పాత్రపై ఐసీఏఐ డిసిప్లినరీ డైరెక్టరేట్‌ మూడుసార్లు అధ్యయనం చేసిందని, వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు వేర్వేరు అధికారులు ఏకాభిప్రాయంతో క్రమశిక్షణ కమిటీకి నివేదికలు అందించినట్లు వివరించింది.

వైఎస్సార్సీపీ కబంధ హస్తాల నుంచి ఏసీఏకి త్వరలో విముక్తి - నూతన అధ్యక్షుడిగా ఎవరంటే? - ACA freed from YSRCP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.