కర్ణాటక నుంచి రాష్ట్రంలోకి నిషేధిత గుట్కాలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు 30 లక్షల విలువ చేసే గుట్కాలను స్వాధీనం చేసుకున్నట్లు నల్లపాటు సీఐ వీరస్వామి వెల్లడించారు. రోజువారి తనిఖీల్లో భాగంగా గుంటూరు రూరల్ మండలం రెడ్డిపాలెం సమీపంలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా గుట్కా పట్టుబడినట్లు వివరించారు. కర్ణాటక నుంచి రాష్ట్రంలోకి వస్తున్న కంటైనర్లో నిందితులు గుట్కాను తరలిస్తున్నారని తెలిపారు.
ఇదీ చదవండి: తెలంగాణ మద్యం తరలిస్తున్న వాహనం పట్టివేత