ETV Bharat / state

వినుకొండలో భారీ స్థాయిలో నిషేధిత గుట్కా పట్టివేత

గుంటూరు జిల్లాలో ఎన్​ఫోర్స్ మెంట్ అధికారులు 61 వేల నిషేధిత గుట్కా, ఖీనీ ప్యాకెట్లను పట్టుకున్నారు. వీటి విలువ రూ.20 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు.

gutka captured at vinukonda
వినుకొండలో భారీ స్థాయిలో నిషేధిత గుట్కా పట్టివేత
author img

By

Published : Mar 17, 2021, 9:28 AM IST

గుంటూరు జిల్లా వినుకొండలో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు భారీ స్థాయిలో నిషేధిత గుట్కాను పట్టుకున్నారు. సుమారు రూ.20 లక్షలు విలువ చేసే 61,000 ప్యాకెట్లును స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత గుట్కా, ఖైనీ వ్యాపారానికి వినుకొండ కేంద్రంగా మారిందన్నారు. అక్రమ ధనార్జనే ధ్యేయంగా కొందరు వ్యక్తులు నిషేధిత గుట్కా వ్యాపారానికి పాల్పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

రూ.లక్షలు విలువ చేసే గుట్కాలను పక్క రాష్ట్రాల నుంచి దిగుమతులు చేస్తూ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు తరలిస్తునారని అధికారులు తెలిపారు. బీఎంపీఎస్​ పార్సెల్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా గుట్కా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని అన్నారు. భారీగా నిషేధిత గుట్కా అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం మేరకు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు వినుకొండలో రాత్రి దాడులు నిర్వహించారు.

పట్టణంలోని ముండ్లమూరు బస్టాండ్ బీఎంపీఎస్ పార్సిల్ ట్రాన్స్ పోర్ట్​లో గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. వీటిని తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా నుంచి విజయవాడకు.. అక్కడి నుంచి వినుకొండ, ప్రకాశం జిల్లా మార్కాపురం, దోర్నాల వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు.

ఇదీ చదవండి:

జాతీయ రహదారిపై రూ.కోటి పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.