ETV Bharat / state

'మమ్మల్ని హతమార్చేందుకు కుట్ర పన్నారు'

గుంటూరు జిల్లా మాచర్లలో జరిగిన ఘటనలపై తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమకు... గురజాల డీఎస్పీ నోటీసులు జారీ చేశారు. ఈ విషయమై స్పందించిన ఎమ్మెల్సీ బుద్ధా... తమను హతమార్చేందుకు పోలీసులు మళ్లీ కుట్ర పన్ని నోటీసులు పంపారని ఆరోపించారు. ముందు పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిని అరెస్ట్​ చేసి పోలీసులు తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని హితవు పలికారు. లేకుంటే తమపై జరిగిన హత్యాయత్నం కేసు సీబీఐకి అప్పగించాలని న్యాయస్థానాన్ని కొరతామన్నారు.

ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమకు గురజాల డీఎస్పీ నోటీసులు జారీ

author img

By

Published : Mar 17, 2020, 1:00 PM IST

Gurula DSP Notice Issuing tdp leaders
ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమకు గురజాల డీఎస్పీ నోటీసులు జారీ

తమను హతమార్చేందుకు పోలీసులు కుట్ర పన్ని నోటీసులు పంపారని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. గుంటూరు జిల్లా మాచర్లలో జరిగిన ఘటనలపై తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమకు గురజాల డీఎస్పీ నోటీసులు జారీ చేశారు. మాచర్ల ఘటనకి సంబంధించిన ఆధారాలతో వాంగ్మూలం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందుకు తన కార్యాలయానికి రావాలని గురజాల డీఎస్పీ నోటీసులో వివరించారు. ఈ విషయమై బుద్దా వెంకన్న స్పందించారు.

పోలీసులు ముందు పిన్నెలి రామకృష్ణారెడ్డిని అరెస్ట్​ చేసి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని హితవు పలికారు. లేకుంటే తమపై జరిగిన హత్యాయత్నం కేసు సీబీఐకి అప్పగించాలని న్యాయస్థానాన్ని కోరతామని వెల్లడించారు. ఫోన్లు టాప్ చేసి తమపై తప్పుడు కేసులు పెట్టాలని పోలీసులు చూస్తున్నారని ధ్వజమెత్తారు. తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమపై ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో హత్యాయత్నం జరిగిందని బుద్దా చెప్పారు.

ఘటన జరిగిన సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరును ప్రజలంతా చూశారని విమర్శించారు. తాము ఇచ్చిన సమాచారాన్ని.. పోలీసులు పిన్నెల్లికి ఇచ్చి తమపై సహకరించారని ఆరోపించారు. ఇప్పుడు అదే తరహాలో మళ్లీ కుట్ర పన్నుతున్నారని వ్యాఖ్యానించారు. తమకు ఆంధ్రా పోలీసులు మీద నమ్మకం లేదని తెలిపారు. ఇప్పటికైనా పోలీసులు రక్షణ కల్పించి నిజాయితీ నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి:

అల్లర్లు జరిపేందుకు తెదేపా కుట్ర: మాచర్ల ఎమ్మెల్యే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.