ETV Bharat / state

farmers problems: బంగారంలాంటి బంతిపూలు.. లాభాల్లేక నేలపాలు..! - ap top news

వరుస పండగలొస్తున్నాయి పూలు బాగా అమ్ముడుపోతాయని ఆశపడ్డాడు. 15 వేల రూపాయల ఖర్చు చేసి పండించిన పంటను మార్కెట్​కి తీసుకెళ్లాడు. దురదృష్టవశాత్తు వర్షం పడటంతో.. ఆ పూలు అమ్ముడుపోలేదు. ఏం చేయాలో పాలుపోని రైతు.. వాటిని ఇంటికి తీసుకెళ్లాలనుకున్నాడు. కానీ తీసుకెళ్లేందుకు కూడా డబ్బులు వృథా అనుకొని మార్గమధ్యంలో బంగారంలాంటి బంతిపూలను పారబోసి వెళ్లిపోయాడు.

gunturu-district-kotanemalipuri-farmer-throwing-flowers-on-the-road-cause-of-losses
బంగారంలాంటి బంతిపూలు.. లాభాల్లేక నేలపాలు..!
author img

By

Published : Sep 4, 2021, 10:39 AM IST

వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని, ఉద్యానపంటలు సాగు చేస్తే అవి కూడా రైతులను నట్టేట ముంచుతున్నాయి. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కోటనెమలిపురి గ్రామానికి చెందిన రామాంజనేయరెడ్డి 18 ఎకరాల్లో బంతిపూలు సాగుచేశారు. వినాయకచవితి ముందు దిగుబడి వస్తే.. వరుస పండుగల నేపథ్యంలో ధరలు బాగుంటాయని ఆనందపడ్డాడు. తీరా మార్కెట్‌కు తీసుకొస్తే కొనేవారు కరవయ్యారని వాపోయారు.

2 టన్నుల పూలు కోయడానికి రూ.6500, కోటనెమలిపురి నుంచి గుంటూరు మార్కెట్‌కు తీసుకురావడానికి వ్యానుకు కిరాయి రూ.4500, లోడింగ్‌, ఇతర ఖర్చులు కలిపితే మొత్తం రూ.15వేల వరకు వెచ్చించినట్లు రైతు రామాంజనేయరెడ్డి తెలిపారు. గుంటూరు మార్కెట్‌లో శుక్రవారం కొనుగోలు జరిగే సమయానికి వర్షం రావడంతో పూలు అమ్ముడుపోలేదని.. చేసేది లేక తిరుగుప్రయాణంలో పేరేచర్ల వద్ద పారబోసి వెళుతున్నానని రామాంజనేయరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: Khairatabad Ganesh: ఖైరతాబాద్ బడా గణేశ్​కు తుది రూపం.. ఈసారి భక్తులందరికీ నేత్రోత్సవం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.