గుంటూరు జిల్లా నంబూరు వీవీఐటీ కళాశాల 12వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రముఖ సినీనటుడు జయప్రకాశ్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోస్టర్ చిత్రయూనిట్ హీరో, హీరోయిన్లు సందడి చేశారు. విద్యార్థులు కృషి పట్టుదలతో సాధించిన విజయాలే... కళాశాల ఎదుగుదలకు దోహదపడ్డాయని విద్యా సంస్థల ఛైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ అన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. సమాజం పట్ల బాధ్యత గల పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: