ETV Bharat / state

గ్రామ రక్షక దళాన్ని ప్రారంభించిన గుంటూరు అర్బన్​ ఎస్పీ

author img

By

Published : Jan 9, 2021, 12:35 PM IST

గుంటూరులోని చేబ్రోలు పోలీస్​స్టేషన్ వద్ద గ్రామ రక్షక దళాన్ని జిల్లా అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ప్రారంభించారు. దేవాలయాలను కాపాడటమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు.

grama rakshaka dalam
గ్రామ రక్షక దళాన్ని ప్రారంభిస్తున్న గుంటూరు అర్బన్​ ఎస్పీ

గ్రామాల్లో దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి అన్నారు. చేబ్రోలు పోలీస్​స్టేషన్ వద్ద గ్రామ రక్షక దళాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతి గ్రామంలో పది మంది యువకులను ఒక కమిటీగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికల సమాచారం పోలీసులకు అందించటం రక్షకదళం కర్తవ్యమని చెప్పారు.

ముఖ్యంగా విజిబుల్ పోలీసింగ్​కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అనంతరం రక్షక దళం సభ్యులకు షర్ట్స్​, క్యాపులు, బూట్లు, లాఠీలు, విజిల్స్, డ్రాగన్, చార్జింగ్ లైట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు, ఎస్సైలు కిషోర్, అశోక్ కుమార్, ఆర్.కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'పిడుగురాళ్ల, నడికుడి రైల్వే స్టేషన్లలో సమస్యలు పరిష్కరించండి.. రైళ్లు ఆపించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.