స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తిగా అపహాస్యం పాలైందని గుంటూరు జిల్లా తెదేపా ఎన్నికల కమిటీ కన్వీనర్ మన్నవ సుబ్బారావు అన్నారు. పోలీసులు శాంతి భద్రతల నిర్వహణలో వైఫల్యం చెందారని ఆరోపించారు. తెదేపా నేతలు బుద్దా వెంకన్న, బోండా ఉమాపై వైకాపా కార్యకర్తల దాడిని ఆయన ఖండించారు. ఎన్నికల ప్రక్రియలో పోలీసుల జోక్యం పెరిగిందని.. పోలీసులే వైకాపా కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ కూడా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: