ETV Bharat / state

ఎస్పీ కార్యాలయానికి మహిళ.. ఎదురెళ్లి ఫిర్యాదు స్వీకరించిన విశాల్​ గున్నీ - sp vishal gunni helps to handicapped women in guntur

సమస్య పరిష్కారం కోసం స్టేషన్​కు వచ్చిన విభిన్న ప్రతిభావంతురాలికి స్వయంగా ఎస్పీనే ఎదురెళ్లి ఫిర్యాదును స్వీకరించారు. ఆమె ఇబ్బందులను తెలుసుకొని.. వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

guntur sp vishal gunni
ఎస్పీ విశాల్ గున్నీ
author img

By

Published : Apr 13, 2021, 5:31 PM IST

Updated : Apr 13, 2021, 5:38 PM IST

తన సమస్యను పరిష్కరించాలని కోరుతూ.. గుంటూరు గ్రామీణ ఎస్పీ కార్యాలయానికి విభిన్న ప్రతిభావంతురాలు వచ్చింది. స్టేషన్​లోకి రాలేకపోతున్న ఆమె పరిస్థితిని తెలుసుకుని ఎస్పీ.. స్వయంగా బయటకు వచ్చారు. తన సమస్య ఏంటో అడిగి తెలుసుకుని.. వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన తుమ్మ సురేఖ దేవి అనే విభిన్న ప్రతిభావంతురాలు గ్రామ, వార్డు సచివాలయం పరీక్షలో ఎంపికై.. మహిళా సంరక్షణ అధికారిగా నియమించబడ్డారు. ఆమెకు నూజెండ్ల మండలం ములకులరు గ్రామంలో పోస్టింగ్ ఇచ్చారు. అయితే రోజు అక్కడికి వెళ్లిరావాలంటే ఇబ్బందిగా ఉందని.. తనను మంగళగిరికి ట్రాన్స్​ఫర్ చేయాలని ఎస్పీ విశాల్ గున్నీని కోరారు. పరిశీలించి తగిన న్యాయం చేస్తానని ఎస్పీ హామీ ఇచ్చారు.

ఇదీ చదవండీ.. హనుమంతుడి జన్మస్థానం అంజనాద్రే.. నవమినాడు నిరూపిస్తాం: తితిదే

Last Updated : Apr 13, 2021, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.