గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రం కోటప్పకొండలో పర్యటించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో మార్చి 11న జరగనున్న మహాశివరాత్రి వేడుకలను ఆయన పరిశీలించారు. ఈ తిరునాళ్లకు అధిక సంఖ్యలో భక్తులు రానుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. శ్రీ త్రికోటేశ్వరస్వామి ఆలయం బయట, లోపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా పోలీసులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా తిరునాళ్ల సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా.. తీసుకోవాల్సిన చర్యల గురించి ఎస్పీ వివరించారు. కోటప్పకొండకు వచ్చే భక్తలు.. 5 గంటల కల్లా కొండకు చేరుకునే విధంగా నిర్వాహకులకు తగిన సూచనలు చేశారు. అనంతరం స్వామి వారిని.. ఎస్పీ దర్శించుకున్నారు.
ఇదీ చదవండీ.. ఒంటరిగా ఉంటావా? మాస్కు తియవా? అంటూ..