కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో పోలీస్ శాఖ ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తోందని గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ అన్నారు. గుంటూరు గ్రామీణ జిల్లా పరిధిలో కరోనా వైరస్ బారిన పడి కోలుకుని మరల విధులకు హాజరైన పోలీస్ సిబ్బందిని అయన అభినందించి విధుల్లోకి సాదరంగా ఆహ్వానించారు.
కరోనా వ్యాధి లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు చేయించడం మొదలు వ్యాధి నిర్ధరణ అయ్యాక వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించడం వంటి చర్యలు చేపట్టడంలో పోలీసుల పాత్ర ఎంతో ఉందన్నారు. ప్రతి క్షణం ప్రజా శ్రేయస్సే ధ్వేయంగా భావించి కరోనా వ్యాప్తి నివారణకు అహర్నిశలు శ్రమిస్తున్న పోలీస్ వారు కూడా ఈ కరోనా మాహమ్మారి బారిన పడ్డారని ఒకింత ఆవేదన చెందారు.
ఇప్పటి వరకు గుంటూరు గ్రామీణ జిల్లాలో మొత్తం 63 మంది పోలీసులు కరోనా బారిన పడగా.. వారిలో 25 మంది కరోనా మహామ్మారిని జయించి.. భయం లేకుండా తిరిగి మరల విధులకు హాజరు అవ్వడం సంతోషంగానూ, గర్వంగాను ఉందని ఎస్పీ అన్నారు. కరోనా మహమ్మారిని జయించి, విధులకు హాజరైన వారినీ స్ఫూర్తిగా తీసుకుని.. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో విధులు నిర్వహించాలన్నారు. ప్రజలు ఎవరైనా కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారు వెంటనే దగ్గరలోని పోలీస్ వారికి లేదా వైద్య సిబ్బందికి తెలియపరచి వారి సూచనలు పాటించాలన్నారు.
ఇదీ చదవండి: