ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి గుంటూరు జిల్లా వాసులు వారికి అండగా నిలిచారు. గుంటూరు జిల్లా జమియతుల్ ఉలేమా సభ్యులు స్థానిక ప్రజల వద్ద నిత్యవసర సరుకులు సేకరించి పంపిణీకి సిద్ధం చేశారు. వాటిని తెలంగాణ రాష్ట్రంలోని వరద భాదితలకు అందచేస్తున్నామని జమియతుల్ ఉలేమా కమిటీ సభ్యులు మౌలానా ఖారీ ఉస్మాన్ తెలిపారు.
ప్రజల వద్ద సేకరించిన నిత్యవసర సరుకులలోంచి మొదటి విడతగా 30 క్వింటాళ్ల బియ్యం, నిత్యావసర సరకుల, దుస్తులును హైదరాబాద్ వాసులకు పంపిణీ చేస్తున్నట్లు జమియతుల్ ఉలేమా కమిటీ సభ్యులు మౌలానా ఇస్మాయిల్ తెలిపారు. ఆపదలో ఉన్నవారికి తమ వంతు సాయం చేయడమే లక్ష్యంగా ఈసేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వారు చెప్పారు.
ఇదీ చదవండి:
కొత్త వైద్య కళాశాలలకు జనవరి 16లోగా టెండర్లు పూర్తి చేయాలి: సీఎం