FAKE CURRENCY: గుంటూరు జిల్లా మేడికొండూరు నకిలీ నోట్ల చలామణి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మొన్న రాత్రి నకిలీ నోట్లు మార్పిడి చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు... నిన్న రాత్రి మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు గుంటూరు, నడికుడి, దాచేపల్లికి చెందినవారిగా గుర్తించారు. రెండ్రోజుల్లో నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు వివరించారు.
రాష్ట్రానికి చెందిన మొత్తం ఆరుగురు వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడి నకిలీ నోట్లు తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గుంటూరు పట్టణ కేంద్రంలోనే వారందరూ కలిసి నెలరోజులుగా కలర్ జిరాక్స్ సాయంతో రూ. 100, 200, 500 నోట్లను ముద్రిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇలా తయారు చేసిన నోట్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్పిడి చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మొత్తం రెండు నుంచి నాలుగు లక్షల వరకు నోట్లను మార్పిడి చేసి ఉంటారని పోలీసులు చెబుతున్నారు.
సంబంధిత కథనాలు: FAKE CURRENCY: గుంటూరులో నకిలీ నోట్ల కలకలం.. ఇద్దరి అరెస్ట్