కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో జిల్లాలో అదనంగా మరికొన్ని ఆసుపత్రులను కోవిడ్ చికిత్సకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలను రాష్ట్ర కోవిడ్-19 ఆసుపత్రిగా మార్చనున్నారు. వసతులు కల్పించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని జేసీ ఏఎస్.దినేష్‌కుమార్ ఆసుపత్రి మేనేజ్‌మెంట్ నిఘా, నిర్వహణ బృంద అధికారులను ఆదేశించారు. నగరంలోని అమరావతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అశ్విని ఆసుపత్రి, వేదాంత ఆసుపత్రి, శ్రీలక్ష్మి సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి, శ్రావణి ఆసుపత్రి, గుంటూరు కిడ్నీకేర్ సెంటర్, తులసీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, ఆదిత్య ఆసుపత్రి, నరసరావుపేటలోని శ్రీదత్త సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి, వెంకటేశ్వర నర్సింగ్ హోం, పిడుగురాళ్లలోని డాక్టర్ అంజిరెడ్డి ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నగదు రహిత చికిత్స అందిస్తారని జేసీ తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా పాజిటివ్ వ్యక్తులకు అందుతున్న వైద్యసేవలు, ఆసుపత్రులలో వసతుల పరిశీలనకు రెండు బృందాలను ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి. శ్రీశైలానికి వరద ప్రవాహం.. 849కు చేరిన నీటిమట్టం