ETV Bharat / state

Farmers Problems: గిట్టుబాటు ధరలేక.. అమ్ముడుపోక.. - guntur farmers problems news

అన్నదాతలను ఏదొక రూపంలో కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. వ్యవసాయ పంటలు పండిస్తే గిట్టుబాటు ధరలు లభించడం లేదని.. ఉద్యాన పంటలు పండిస్తే అవి కూడా రైతులను నట్టేట ముంచుతున్నాయి. బంతిపూలు సాగు చేసి.. కోత కోసి.. అద్దె వాహనంలో మార్కెట్‌కు తీసుకువస్తే.. అమ్ముడుపోక రోడ్డు పక్కన పారబోయాల్సిన దుస్థితి నెలకొంది. ఆదాయం రాకపోగా పెట్టుబడి కూడా రాకపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు.

guntur flowers farmers face problems with rains and no rate in market
దీనస్థితిలో రైతన్న
author img

By

Published : Sep 5, 2021, 3:20 PM IST

రోడ్డుపై పూలు పారబోసిన రైతు

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కోటనెమలిపురి గ్రామానికి చెందిన రామాంజనేయ రెడ్డి.. 18 ఎకరాల్లో బంతిపూలు సాగు చేశారు. అధిక మొత్తంలో దిగుబడి వస్తే.. వరుస పండుగల నేపథ్యంలో ధరలు బాగా ఉంటాయని ఆశించారు. గంపెడు ఆశలతో.. పూలను మార్కెట్‌కు తీసుకెళ్లిన ఆయనకు నిరాశే ఎదురైంది. బంతిపూలను అద్దె వాహనంలో మార్కెట్‌కు తీసుకెళ్తే.. కనీసం కొనేవారే కరవయ్యారు. పూలు అమ్ముడుపోక దిక్కు తోచని స్థితిలో.. పేరేచర్ల వద్ద పూలను రోడ్డు పక్కనే పారబోశారు.

రెండు టన్నుల బంతి పూలు కోయడానికి.. కూలీలకు 6వేల 500 రూపాయలు ఖర్చైందని.. మార్కెట్ తీసుకురావడానికి మరో 4వేల 500 వ్యాన్‌కు చెల్లించినట్లు రైతు చెప్పారు. లోడింగ్ ఇతర ఖర్చులు కలిపి రూ. 15వేల వరకు చెల్లించినట్లు తెలిపారు. గుంటూరు మార్కెట్లో కొనుగోలు జరిగే సమయానికి వర్షం రావడంతో పూలు అమ్ముడుపోలేదని.. అందుకే పూలు పారబోసినట్లు రైతు రామాంజనేయులు తెలిపారు. వర్షం తగ్గిన తర్వాత అయినా ధర వస్తుందో రాదో తెలియదని రైతు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదాయం రాకపోగా కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు.

ఇదీ చదవండి:

Medico Suicide: ఉరివేసుకుని వైద్యవిద్యార్థిని ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.