గుంటూరు జిల్లా అంబులెన్స్ డ్రైవర్లు, యజమానులతో డీటీసీ మీరాప్రసాద్ సమావేశమయ్యారు. కొవిడ్ మృతదేహాల తరలింపునకు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో ఆ అంశంపై చర్చించారు. కొవిడ్ రోగుల మృతదేహాల తరలింపునకు ధరలు నిర్ణయించినట్లు చెప్పారు. ఎక్కువ డబ్బు డిమాండ్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రవాణా కార్యాలయాల్లో మే 31 వరకు డ్రైవింగ్ టెస్టులు నిలిపేసినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: కొవిడ్ కేర్ సెంటర్ను పరిశీలించిన సబ్ కలెక్టర్ మయూరి అశోక్