గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం అచ్యుతాపురం గ్రామంలో గుట్కా అమ్మకాలను పోలీసులు అడ్డుకున్నారు. పక్కా సమాచారంతో ఓ దుకాణంలో అడవులదీవి పోలీసు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. రూ. లక్ష 70 వేల విలువగల 15 గుట్కా బ్యాగ్ లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
దుకాణం నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. గుట్కా, ఖైనీ అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హరిబాబు హెచ్చరించారు.
ఇదీ చూడండి