కరోనా వైరస్ను కట్టడి చేయడంలో భాగంగా అధికారులు నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి శామ్యూల్ అనంద్ కుమార్ ఆదేశాల మేరకు.. గుంటూరు నగరంలో మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తున్న 22 మందికి ఒక్కొక్కరికి రూ.1000 జరిమానా విధించినట్లు నగర కమిషనర్ చల్లా అనురాధ తెలిపారు.
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతీ ఒక్కరు స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. గుంటూరు నగరంలో ప్రత్యేక పర్యవేక్షక బృందాలను నియమించామని.. ఎవరైనా మాస్క్ లేకుండా వీధుల్లోకి వస్తే రూ.1000 జరిమాన విధిస్తారన్నారు.
ఇదీ చూడండి: