గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గించేందుకు అధికారులు చేపడుతున్న చర్యల్లో భాగంగా మే 13 వరకూ పూర్తి లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ఆర్డీఓ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర సరకులను వారి ఇంటి వద్దకే అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
ఎవరికైనా సరకులు అందకపోతే కమాండ్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి తెలియజేయలన్నారు. ఫోన్ నెంబర్లు 08647 - 295551, 295552, 295553 లుగా ఆయన తెలిపారు. అధికారులు చేపట్టిన మిషన్ మే 15 కు పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు.
మే 15 నాటికి నరసరావుపేట లో కరోనా పాజిటివ్ కేసులు జీరో స్థాయికి తేవాలని అధికారులు నిర్ణయించినట్లుగా ఆయన తెలిపారు. కాబట్టి ప్రజలు గమనించి ఎవరూ బయటకు రాకుండా నిబంధనలు పాటించాలని.. ఆంక్షల అమలుకు సహకరించాలని ఆర్డీఓ కోరారు.
ఇదీ చూడండి: