గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో 52 ఎకరాల్లో ఉన్న టిడ్కో పీఎంఏవై గృహ సముదాయాలలో ప్రస్తుతం ఉన్న కొవిడ్ క్వారంటైన్ సెంటర్‌ను కొవిడ్ కేర్ సెంటర్‌గా మార్చుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి చిలకలూరిపేట క్వారంటైన్ సెంటర్లో 105 మంది కొవిడ్ అనుమానితులు ఉన్నారు. వారిలో 18 మందికి పాజిటివ్ నిర్ధరణ అయింది.
ప్రస్తుతం ఉన్న ఐదు వందల బెడ్లను వెయ్యికి పెంచుతున్నట్లు జేసీ తెలిపారు. ఇక్కడే ల్యాబ్ కూడా ఏర్పాటు చేసి అనుమానితులకు ట్రూ నాట్, స్వాబ్ పరీక్షలను నిర్వహిస్తామన్నారు. కేర్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొవిడ్ కేర్ సెంటర్లో ఉండేవారికి వైఫై సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు.
ఇదీ చూడండి: టిక్‌టాక్ సహా ఆ యాప్‌లు సర్కార్‌పై కేసు వేయొచ్చు'