విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఉపాధ్యాయుడే కాటేశాడు. నరసరావుపేట మండలం పమిడిపాడు చెందిన జరుగుమల్లి వెంకటేశ్వర్లు (37) అదే గ్రామంలోని ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. గ్రామ వాలంటీరుగానూ కొనసాగుతున్నాడు. అతనికి వివాహమై భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పాఠశాలలో పనిచేస్తున్న సమయంలో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. వారు అతనికి భయపడి చాలారోజులు విషయాన్ని గోప్యంగా ఉంటారు. వేధింపులు శ్రుతిమించడం వల్ల కొందరు విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పారు. కోపోద్రిక్తులైన కన్నవారు... పాఠశాలకు వెళ్లి అతనిపై గతంలో దాడికి యత్నించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అతనిపై చర్చలు తీసుకంటానని చెప్పినందున అప్పటికి సమస్య సద్దుమణిగింది. తర్వాతా తన పద్ధతి మార్చుకోలేదు అతను. విహారయాత్ర పేరుతో పాఠశాలకు చెందిన 28 మంది విద్యార్థినిలను సంక్రాంతి సెలవుల్లో తన సొంత ఖర్చులతో కొండవీడు కోటకు తీసుకెళ్లాడు. అక్కడ తన వక్రబుద్ధి ప్రదర్శించాడు. తిరిగివచ్చాక బాధిత విద్యార్థినులు మరోసారి తల్లిదండ్రులకు చెప్పడం వల్ల వారు ఉపాధ్యాయుడిపై లిఖితపూర్వకంగా ప్రధానోపాధ్యాయురాలికి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి శుక్రవారం ఆ ఉపాధ్యాయిడిని విధుల నుంచి తొలగించామని ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు.
విచారణ తర్వాత చర్యలు
వెంకటేశ్వర్లుపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి... విచారణ జరిపి నిజమని తేలితే వాలంటీరు విధుల నుంచి తొలగిస్తామని ఎంపీడీవో బూసిరెడ్డి చెప్పారు. జిల్లా ఉప విద్యాశాఖ అధికారి కిరణ్కుమార్ సోమవారం పాఠశాలకు వెళ్లి విచారణ జరుపుతామని, ఈ వ్యవహారంలో పాఠశాల ఉపాధ్యాయుల పాత్ర ఉంటే వారిపైనా చర్యలు తీసుకునేలా పాఠశాల కరస్పాండెంట్కు నివేదిక పంపుతామన్నారు.
ఇదీ చదవండి :