గుంటూరు జిల్లా క్రోసూరు మార్కెట్ యార్డు ఛైర్మన్గా వెంపా జ్వాల నర్సింహారావు నియమితులయ్యారు. వైస్ ఛైర్మన్గా ఆవుల రమాదేవితో పాటు 17 మందిని సభ్యులుగా నియమిస్తూ మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి మధుసూధనరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జ్వాలా నర్సింహారావు గతంలోనూ ఓసారి మార్కెట్ యార్డు ఛైర్మన్గా పనిచేశారు.
గౌరవ ఛైర్మన్గా పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరి శంకరరావు ఉంటారు. తనకు ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి నర్సింహారావు కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు మేలు జరిగేలా పనిచేస్తానని చెప్పారు.
ఇవీ చదవండి... : 'అదనపు సమాచారం కోసం అచ్చెన్నాయుడిని కస్టడీకి ఇవ్వండి'