జిల్లాలో కొవిడ్ రెండో దశ వ్యాప్తి, వైరస్ మృతులు మరణాలు జరగకుండా అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని... గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. అక్టోబర్‌లో (88) తో పోలిస్తే... నవంబర్‌లో (28) కరోనా మరణాలు తక్కువగా నమోదయ్యాయని, డిసెంబరులోనూ కరోనా మరణాలు తగ్గించేందుకు వైద్యారోగ్య శాఖ సిబ్బంది కృషి చేయాలని సూచించారు. కొవిడ్-19 మరణాల కారణాలను విశ్లేషించి మరణాల సంఖ్య తగ్గించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని నిపుణుల కమిటీని కోరారు.
రెండో దశలో కొవిడ్ వ్యాప్తి చెందకుండా... తీసుకోవాల్సిన చర్యల కోసం ప్రత్యేకంగా కమిటీని నియమించనున్నట్లు జిల్లా పాలనాధికారి తెలిపారు. గతంతో పోలీస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, సిబ్బందిని పెంచామన్నారు. డిసెంబర్ 31 తరువాత వైరస్ నిర్ధరణ కోసం ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు చేయాలని ఐసీఎంఆర్ ఆదేశాలు జారీ చేసిందని, ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. కాటూరి మెడికల్ కళాశాలలోనూ ఆర్‌టీపీఆర్ పరీక్షల కోసం ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆనంద్ కుమార్ సూచించారు.
ఇదీ చదవండి