ETV Bharat / state

రంజాన్​ మాసంలో మసీదులోకి ఆ నలుగురికే అనుమతి - ramzam month during quarantine

రంజాన్​ మాసంలో మసీదులోకి నలుగురికి మాత్రమే అనుమతిస్తామని గుంటూరు కలెక్టర్​ శామ్యూల్​ ఆనంద్​ కుమార్​ అన్నారు. ఇమామ్‌, మౌజన్‌తో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. వారి వివరాలు ముందుగానే చెప్పాలన్నారు. రంజాన్​ మాసం మొత్తం మసీద్​లోనే క్వారంటైన్​లో ఉండాలని కలెక్టర్​ ఆదేశించారు.

guntur collector on ramzan prayers during lock down
రంజాన్​ మాసం ప్రార్థనలపై కలెక్టర్​ శామ్యూల్​
author img

By

Published : Apr 24, 2020, 1:20 PM IST

రంజాన్‌ మాసంలో ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు మసీదులోకి ఇమామ్‌, మౌజన్‌తో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతిస్తామని గుంటూరు కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ అన్నారు. మసీదులోకి అనుమతిచ్చే వారి వివరాలను ముందుగా తెలియజేయాలన్నారు. రంజాన్‌ మాసం మొత్తం వారు నలుగురు మసీదులోనే క్వారంటైన్‌లోనే ఉండాలని.. లేకపోతే మసీదుకు సమీపంలోని వారిని నియమించుకోవాలని సూచించారు. రెడ్‌జోన్లలో ఉండేవారికి ఇంటివద్దకే డ్రైప్రూట్స్‌ అందిస్తామన్నారు. మిగిలిన ప్రాంతాల్లో ఉదయం లాక్‌డౌన్‌ మినహాయింపు సమయంలో తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంపై కరోనా పడగ... ఒకే రోజు 80 కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.