గతంలో ఇసుక కొరతతో నాలుగు నెలలు ఇబ్బందులు పడిన కూలీలు, భవనాలకు రంగులు వేసే పెయింటర్లు.. లాక్డౌన్తో ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు బొంగరాల బీడుతోపాటు నగరంలో వేలాదిమంది పెయింటర్లున్నారు. లాక్డౌన్తో పనిలేక కుటుంబాలను పోషించలేక అగచాట్లు పడుతున్నారు. ప్రభుత్వం ఉచిత బియ్యం, వెయ్యి రూపాయలు ఇచ్చినప్పటికీ కొందరికే పరిమితమయ్యాయని.. అందరికీ ఉపశమనం దక్కలేదని వాపోతున్నారు. ఆకలితో అలమటిస్తున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి: వలస కూలీల కన్నీటి వ్యథలు