గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం నడింపల్లిలో కాల్పులు కలకలం సృష్టించాయి. రమాదేవి అనే మహిళపై సైనికోద్యోగి బాలాజీ కాల్పులు జరిపాడు. ఆమె కుమార్తెను ప్రేమిస్తున్నానంటూ గత కొంత కాలంగా బాలాజీ వెంటపడుతున్నాడు. ఈ క్రమంలో రమాదేవిపై బాలాజీ కాల్పులు జరిపాడు. తన కుమార్తెను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. చివరికి తమపై దాడి చేశాడని రమాదేవి ఆరోపించారు. తన కుటుంబసభ్యులను చంపేస్తానంటూ బాలాజీ పిస్టల్ తీసుకువచ్చాడని కన్నీళ్లు పెట్టుకున్నారు.
పరారీలో బాలాజీ..
బాలాజీ కాల్పుల ఘటనలో రమాదేవి బయటపడింది. ఆమె చెవికి గాయమైంది. ఘటన జరిగిన వెంటనే బాలాజీ పరారవగా.. అతనికి సహకరించిన ఆటో డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి: