ETV Bharat / state

రాష్ట్రంలో డీఎస్పీల బదిలీ..6 సబ్‌డివిజన్లకు కొత్త ఎస్‌డీపీవోలు

author img

By

Published : Jun 25, 2021, 7:52 AM IST

రాష్ట్రంలో 22 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 6 సబ్‌డివిజన్లకు కొత్త ఎస్‌డీపీవోలు.. 3 జోన్లకు నూతన ఏసీపీలను నియమించింది.

Government  transfered   DSPs in the ap
6 సబ్‌డివిజన్లకు కొత్త ఎస్‌డీపీవోలు

రాష్ట్రంలోని ఆరు పోలీసు సబ్‌డివిజన్లు, నగర కమిషనరేట్ల పరిధిలోని 3 జోన్లకు ప్రస్తుతం ఉన్న డీఎస్పీల స్థానంలో వేరేవారిని ఎస్‌డీపీవోలుగా, ఏసీపీలుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. పెనుకొండ, దర్శి, గుంతకల్లు, మచిలీపట్నం, డోన్‌, రాయచోటి సబ్‌డివిజన్లు, విశాఖ ఉత్తరం, విశాఖ దక్షిణం, విజయవాడ సెంట్రల్‌ జోన్లు ఆ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం ఎస్‌డీపీవోలుగా, ఏసీపీలుగా వ్యవహరిస్తున్న వారిలో కేవలం ఐదుగురు డీఎస్పీలకు మాత్రమే మరో చోట ఎస్‌డీపీవో, ఏసీపీగా అవకాశమిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 22 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ గురువారం ఉత్తర్వులనిచ్చారు. ఏడుగురు అధికారులకు ఎక్కడా పోస్టింగులు ఇవ్వకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.

రాష్ట్రంలో నిరీక్షణలో ఉన్న ఒక నాన్‌క్యాడర్‌ ఎస్పీ, ఇద్దరు అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ ఉత్తర్వులనిచ్చారు. కేపీ లక్ష్మీనాయక్‌ను నిఘా విభాగంలో ఎస్పీగా నియమించారు. ఎస్‌.వెంకటేశ్వరరావును నెల్లూరు నేరాల విభాగం అదనపు ఎస్పీగా, కె.రాజేంద్రరావును విశాఖ గ్రామీణ పరిపాలన విభాగం అదనపు ఎస్పీగా బదిలీ చేశారు.

  • ప్రస్తుతం వివిధ సబ్‌డివిజన్లలో ఎస్‌డీపీవోలుగా, జోన్లలో ఏసీపీలుగా కొనసాగుతూ.. మరో చోట అవే పదవుల్లోకి బదిలీ అయిన అధికారుల వివరాలు

పేరు ప్రస్తుత స్థానం బదిలీ స్థానం
ఎన్‌.రమ్య (ప్రొబేషనరీ) ఎస్‌డీపీవో, కల్యాణదుర్గం ఎస్‌డీపీవో, పెనుకొండ
డి.విశ్వనాథ్‌ (ప్రొబేషనరీ) ఎస్‌డీపీవో, శ్రీకాళహస్తి ఎస్‌డీపీవో, గుంతకల్లు
డా.వి.బి.రాజకమల్‌ ఎస్‌డీపీవో, పాడేరు ఏసీపీ, విశాఖ దక్షిణం
ఎస్‌.ఖదీర్‌బాషా ఎస్‌డీపీవో, చింతూరు ఏసీపీ, విజయవాడ సెంట్రల్‌
వై.శ్రీనివాసరెడ్డి ఏసీపీ, విజయవాడ సెంట్రల్‌ ఎస్‌డీపీవో, డోన్‌

  • ప్రస్తుతం వివిధ విభాగాల్లో డీఎస్పీలుగా పనిచేస్తూ సబ్‌డివిజన్లలో ఎస్‌డీపీవోలుగా, జోన్లలో ఏసీపీలుగా బదిలీ అయిన వారి వివరాలు

పేరు ప్రస్తుత స్థానం బదిలీ స్థానం
వి.నారాయణస్వామిరెడ్డి డీఎస్పీ, స్పెషల్‌ బ్రాంచి, గుంటూరు ఎస్‌డీపీవో, దర్శి
సీహెచ్‌ శ్రీనివాసరావు డీఎస్పీ, స్పెషల్‌ బ్రాంచి, శ్రీకాకుళం ఏసీపీ, విశాఖ ఉత్తరం
షేక్‌ మసూమ్‌బాషా డీఎస్పీ, ట్రాఫిక్‌, మచిలీపట్నం ఎస్‌డీపీవో, మచిలీపట్నం
పి.శ్రీధర్‌ డీఎస్పీ, స్పెషల్‌ బ్రాంచి, కడప ఎస్‌డీపీవో, రాయచోటి

  • 13 మందిని ట్రాఫిక్‌, సీసీఎస్‌, బెటాలియన్స్‌, నిఘా విభాగం, దిశా, ఎస్సీఎస్టీ సెల్‌, స్పెషల్‌ బ్రాంచి విభాగాల్లో డీఎస్పీలుగా నియమించారు.

ఇదీ చూడండి. వైరల్-పోలీసులపై రాళ్లు రువ్విన గ్రామస్థులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.