Government Meeting Cancelled with Employees Union on CPS: సీపీఎస్‌పై వివిధ ఉద్యోగ సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశం వాయిదా పడింది. సమావేశం నేపథ్యంలో రాత పూర్వకంగా సీపీఎస్‌పై ప్రతిపాదనలు సమర్పించాలని సంఘాలను ప్రభుత్వం కోరింది. సీపీఎస్ అంశంపై ఉద్యోగ సంఘాల నుంచి రాతపూర్వక ప్రతిపాదనలను వచ్చే వారం నిర్వహించనున్న సమావేశంలో తీసుకోనుంది. సీపీఎస్ ఆర్డినెన్సు గురించి సీఎం జగన్ ప్రకటనపై ఇప్పటికే ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుండటంతో అత్యవసరంగా సాధారణ పరిపాలన శాఖ ప్రతిపాదనలు కోరింది.
సీఎం జగన్ వ్యాఖ్యలు..: ఉద్యోగుల వ్యతిరేకతకు ముఖ్యమైన కారణం సీఎం జగన్ వ్యాఖ్యలే అని చెప్పొచ్చు. తాజాగా విజయవాడలోని ఏపీ ఎన్జీవోల సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. సీపీఎస్ రద్దు సాధ్యం కాదని.. అందుకే ఓపీఎస్‌కు బదులు జీపీఎస్ తీసుకొస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా జీపీఎస్‌తో ఉద్యోగులకు మంచి జరుగుతుందని అన్నారు. అంతే కాకుండా జీపీఎస్‌పై ఆర్డెనెన్స్ సైతం వస్తుందని చెప్పారు. రాష్ట్రంలో అమలు చేయబోయే జీపీఎస్‌ను ప్రతి రాష్ట్రం కాపీ కొడుతుందని పేర్కొన్నారు.
Employees Opposes GPS: 'సీపీఎస్ రద్దు చేయలి..లేకపోతే ఐక్యంగా ఉద్యమిస్తాం'
ఉద్యోగ సంఘాల ఆగ్రహం: సీఎం జగన్ చేసిన జీపీఎస్ ఆర్డినెన్స్ వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అధికారంలోకి రాకముందు సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి.. తర్వాత ఇప్పుడు మాట మార్చారని మండిపడ్డారు. కనీసం ఉద్యోగులతో చర్చించకుండా లక్షలాది కుటుంబాల భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టేందుకు సీఎం జగన్ చూస్తున్నారని అన్నారు.
పొరుగు రాష్ట్రాలన్నీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తుంటే.. జీపీఎస్ ఎలా గొప్పది అవుతుందని ఉద్యోగ సంఘాలు ప్రశ్నించాయి. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశాయి. రాష్ట్రంలో 3.5 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారని గుర్తు చేశారు. వారందరికీ అన్యాయం చేస్తూ సీఎం జగన్ జీపీఎస్ ఆర్డినెన్స్ ప్రకటించడం బాధాకరమని అన్నారు.
Cabinet Decision on GPS: ఓపీఎస్ పునరుద్ధరించలేం.. జీపీఎస్ తీసుకొస్తున్నాం...
జీపీఎస్‌పై వ్యతిరేకత: ప్రభుత్వం ప్రకటించిన జీపీఎస్‌ను ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గతంలో పలుమార్లు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపినా.. ఉద్యోగులు మాత్రం పాత పింఛన్ విధానం కావాలనే కోరుకుంటున్నారు. లేదంటే మరోసారి ఐక్యంగా ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. మళ్లీ తమను రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి తీసుకురావద్దని హెచ్చరిస్తున్నారు.
చర్చలు ప్రకటించి.. కాసేపటికే వాయిదా: ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న క్రమంలో.. సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం అత్యవసరంగా భేటీ అవుతున్నట్లు ప్రకటించింది. కానీ కొద్దిసేపటికే మళ్లీ వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. రాత పూర్వక ప్రతిపాదనలు, చర్చలను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.
Employees unions: సీపీఎస్ రద్దుపై మాట తప్పితే.. ఎన్నికల్లో ప్రతిఘటన తప్పదు: ఉద్యోగ సంఘాలు