ETV Bharat / state

ఈ అమ్మాయి చేసిన ఒక్క మేసేజ్​తో... ఊరికి బస్సు వచ్చింది!

author img

By

Published : Jan 21, 2021, 9:19 AM IST

ఆ గ్రామానికి రోజూ వచ్చే ఆర్టీసీ బస్సు సర్వీసు ఆగిపోయింది. సాధారణంగా అయితే ఇలాంటి సమయంలో అంతా కలిసి ఆందోళన చేస్తారు. లేదా మాకెందుకని వదిలేస్తారు. కానీ గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం తొండపి గ్రామానికి చెందిన పూజిత మాత్రం మరోలా చేసింది. తన ఊరి సమస్యను వాట్సప్ ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లింది.

ఈ అమ్మాయి చేసిన ఒక్క మేసేజ్​కి ఊరికి బస్సు వచ్చింది!

గుంటూరు జిల్లా తొండపి గ్రామంలో ఒకరు ఇటీవల మద్యం తాగి బస్సు డ్రైవర్, కండక్టర్​తో గొడవ పడ్డారు. ఈ కారణంగా ఆర్టీసీ అధికారులు బస్సు సర్వీసు నిలిపివేశారు. ఒక్కరు చేసిన తప్పుకి ఊరంతా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ విషయాన్నే.. గ్రామానికి చెందిన విద్యార్థిని పూజిత.. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లింది. వాట్సాప్​లో కలెక్టర్ శామ్యూల్ ఆనంద్​​కు లేఖ రాసింది. 'మా గ్రామస్థుల తరఫున క్షమాపణలు కోరుతున్నా. బస్సు లేకపోవడం వల్ల సత్తెనపల్లి వెళ్లేందుకు ఆటోలకు ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. పైగా ఆర్టీసీ బస్సులో మాదిరిగా భద్రత, రక్షణ ఉండటం లేదు. ఇకపై ఇలా జరగకుండా.. గ్రామంలో ఉండే సచివాలయ కార్యదర్శి, వీఆర్వో వంటి వారితో కమిటీ ఏర్పాటు చేయండి' అని పూజిత లేఖలో విజ్ఞప్తి చేసింది.

ఈ సందేశం చూసిన కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ వెంటనే ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రాఘవ కుమార్​తో మాట్లాడారు. బస్సు సర్వీసు పునరుద్ధరించాలని ఆదేశించారు. ఆర్ఎం ఆదేశాలతో సత్తెనపల్లి డిపో మేనేజర్ తొండపి వెళ్లి గ్రామస్థులతో మాట్లాడారు. బస్సు సర్వీసును తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. పూజిత చొరవను ఆర్టీసీ అధికారులు, గ్రామస్తులు అభినందించారు.

ఇదీ చదవండి:

ఎస్‌ఈసీ రిట్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.