ETV Bharat / state

చులకన భావం ఉంటే.. తొలగించుకోండి : కలెక్టర్ శామ్యూల్ ఆనంద్

గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే రోగులకు మంచి వైద్యసేవలు అందించాలని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ అన్నారు. ప్రతి రోగి అనారోగ్యం బాగుపడి ఆరోగ్యవంతులుగా ఆస్పత్రి నుంచి సంతృప్తితో వెళ్లే విధంగా ఆసుపత్రి వైద్యులు కృషి చేయాలని సూచించారు.

GGH_DEVELPMENT
GGH_DEVELPMENT
author img

By

Published : Dec 11, 2020, 7:30 AM IST

ఆసుపత్రికి చికిత్సకు వచ్చేవారంతా మీకింద పని చేసేవాళ్లనే భావన ఉంటే తొలగించుకోవాల్సిందిగా గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ హితవు పలికారు. హెచ్‌డీఎస్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆస్పత్రిలో ముఖ్యంగా నాలుగో తరగతి ఉద్యోగులు, నర్సుల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. రోగులను చులకన భావంతో చూస్తున్నారనే ఫిర్యాదులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సూపరింటెండెంట్‌తో పాటు వైద్యులందరిపై ఉందన్నారు. క్యాథ్‌ల్యాబ్‌ నిర్వహణ గురించి చర్చకు రాగా నిబంధనల ప్రకారం పని చేయాల్సిందేనన్నారు. కొవిడ్‌ బాధితులకు సత్వర చికిత్స అందేవిధంగా పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో జేసీ ప్రశాంతి, సూపరింటెండెంట్‌ ప్రభావతి, డీఎంహెచ్‌వో యాస్మిన్‌ తదితరులు పాల్గొన్నారు.

గుత్తేదారులకు నోటీసులు

సర్వజనాసుపత్రిలో నిలిచిపోయిన నిర్మాణ పనులకు సంబంధించిన గుత్తేదారులకు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. అదే సమయంలో వారికి రావాల్సిన బకాయిల విషయం గురించి సంబంధిత అధికారులతో చర్చిస్తానన్నారు. మార్చురీ విస్తరణ పనులు పూర్తి చేయాలన్నారు. మాతాశిశు సంరక్షణ కేంద్రం పనులు ప్రారంభించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు. క్యాన్సర్‌ వార్డులో అవసరమైన ఉద్యోగులను ఒప్పంద విధానంలో నియమించాలన్నారు.

రూ.8 లక్షలతో ఏం చేద్దాం?

హెచ్‌డీఎస్‌ ఖాతాలో రూ.8 లక్షలు నిల్వ ఉంటే ఆ నిధులతో ఏమీ చేయలేమని కలెక్టర్‌ అభిప్రాయపడ్డారు. వివిధ విభాగాలకు అవసరమైన వైద్య పరికరాల కొనుగోలుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాల్సిందిగా సూచించారు. ఇప్పటికే మంజూరైన పరికరాలు త్వరగా వచ్చేవిధంగా చూడాలని సూచించారు. గైనిక్‌ విభాగానికి అవసరమైన వెంటిలేటర్‌ను కొవిడ్‌ నిధుల నుంచి కొనుగోలు చేయాలని సూచించారు.

పీపీపీ విధానంలో గుండె శస్త్రచికిత్సలు

సర్వజనాసుపత్రిలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో గుండె శస్త్రచికిత్సలు గతంలో జరిగినందున, తిరిగి అదే విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాల్సిందిగా కలెక్టర్‌ సూచించారు. ఎంపీ గల్లా జయదేవ్‌ మంజూరు చేసిన రూ.కోటి నిధులతో నిర్మిస్తున్న రోగుల విశ్రాంత మందిరం నిర్మాణ పనులు జనవరి నెలాఖరుకు పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.

రూ.7.5 కోట్లు రావాలి

ఆరోగ్యశ్రీ పథకం కింద ఆసుపత్రికి రూ.7.5 కోట్లు రావాల్సి ఉందని సూపరింటెండెంట్‌ ప్రభావతి వివరించగా, ఆ నిధులు ఎప్పుడు వస్తాయో చెప్పలేమని కలెక్టర్‌ బదులిచ్చారు. అందువల్ల ఆసుపత్రిలో ఆదాయం ఎంత వస్తుందో చూసుకుని జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలని సూచించారు. క్యాంటిన్‌, సైకిల్‌ స్టాండ్‌ నిర్వహణకు టెండర్లు పిలిచి ఆదాయాన్ని పెంచుకోవాల్సిందిగా సూచించారు. ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ కింద వైద్యులకు ఇస్తున్న ప్రోత్సాహక నగదు భవిష్యత్తులో కొనసాగుతుందో? లేదో? వేచి చూడాల్సి ఉందన్నారు.

మత్తు వైద్యుల కొరత

న్యూరో సర్జరీ, ఆర్థో విభాగాలకు చెందిన బోధనానిపుణులు మాట్లాడుతూ రోగుల సంఖ్య పెరుగుతున్నందున శస్త్రచికిత్సలు చేసేందుకు ఇప్పటికే ఉన్న ఆపరేషన్‌ థియేటర్లు అన్నింటినీ వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మత్తు వైద్యుల కొరత ఉన్నందున శస్త్రచికిత్స మందిరాలన్నింటినీ అందుబాటులో తేలేకపోతున్నామని ఆ విభాగానికి చెందిన వైద్యులు వివరించారు. వెంటనే ఉద్యోగ ప్రకటన జారీ చేసి కొత్తవారిని నియమించుకోవాల్సిందిగా కలెక్టర్‌ సూచించారు.

ఇదీ చదవండి:

ఏలూరులో అంతుచిక్కని వ్యాధి మూలాలపై నేడు స్పష్టత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.