రాష్ట్రంలో అమలవుతున్న సేంద్రియ వ్యవసాయాన్ని జర్మనీ ప్రతినిధి... క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. జర్మనీ బ్యాంకు కెఎఫ్డబ్ల్యూ తరఫున అక్కడి ప్రతినిధి ఇలాస్... గుంటూరు జిల్లాలో పర్యటించారు. సహజ పద్ధతుల్లో తయారయ్యే ఎరువుల వాడకంతో.. నాణ్యమైన పంటలను పండిస్తున్న రైతులను ప్రశంసించారు. స్వయం సహాయక సంఘాలు కలిసికట్టుగా సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి సారించడాన్ని అభినందించారు. సేంద్రియ పంట దిగుబడి తక్కువగా వచ్చిన భవిష్యత్తులో వాటి ఉత్పత్తులకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంటుందని అవగాహన కల్పించారు. జర్మనీలో గోధుమలు, ద్రాక్ష, బార్లీ ,బీన్స్, బంగాళదుంప పండించగా రెండు శాతం మందే.. వ్యవసాయంపై జీవిస్తున్నారన్నారు. ఆధునిక యాంత్రీకరణతో ఒక రైతు రెండువందల ఎకరాలను పండించినట్లు ఆ దిశగా ఇక్కడ సాగు పద్ధతులలో నూతనవిధానాన్ని అవలింబించాలని సూచించారు.
ఇదిచూడండి.ప్రియాంక X యోగి: ప్రతిష్టంభనకు తెర!