ETV Bharat / state

గంజాయి విక్రయిస్తున్న విద్యార్ధి అరెస్ట్

తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తుంటే కొందరు విద్యార్థులు అడ్డదారులు తొక్కుతున్నారు. గంజాయి అమ్ముతున్న ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్..గుంటూరు జిల్లా చిలకలూరిపేట అర్బన్ పోలీసులకు పట్టుబడ్డాడు. చివరకు జైలు పాలయ్యాడు.

ganjai selling Student arrested at chilakaluripet guntur district
గంజాయి విక్రయిస్తున్న విద్యార్ధి అరెస్ట్... 800 గ్రాముల గంజాయి స్వాధీనం
author img

By

Published : Oct 17, 2020, 1:10 AM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్ధి బాలు నాయక్ గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 800 గ్రాముల మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చిలకలూరిపేట అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వివరించారు. పట్టణంలోని సుగాలీ కాలనీకి చెందిన బాలు నాయక్ కాకినాడలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో అగ్రికల్చర్ బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో అక్కడ స్నేహితులు, వివిధ కారణలతో అడ్డదారులు తొక్కాడు. గంజాయికి అలవాటు పడ్డాడు.

కాకినాడ నుండి చిలకలూరిపేట...

గంజాయి తీసుకుంటున్న బాలు.. లాక్​డౌన్ కాలంలో చిలకలూరిపేటకు దాన్ని తీసుకొచ్చి విక్రయించటం మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలోనే చిలకలూరిపేట ప్రాంతంలో ఉన్న పత్తి, నూలు మిల్లుల్లో కాకినాడ ప్రాంతం నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నాడనే సమాచారంతో బాలు​పై పోలీసులు నిఘా పెట్టారు. అందులో భాగంగా ఇవాళ అతని వద్ద నుంచి 800 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారని ఆయన వివరించారు.

పర్యవేక్షణ అవసరం..

యువత తల్లిదండ్రుల కష్టాన్ని విస్మరించి వ్యసనాలకు అలవాటుపడి బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. ఇదీ చాలా భాదాకరం. చెడు వ్యసనాలకు పాల్పడి మంచి భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు పిల్లలను పర్యవేక్షించాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

ఇదీ చూడండి:

శేషాచల అడవుల్లో కూంబింగ్...32 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.