Ganja Missinig at Police Station: గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో సిబ్బంది నిర్లక్ష్యంతో 18 కిలోల గంజాయి బస్తాను దొంగలు అపహరించుకుపోయారు. గత రెండేళ్లుగా మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో వందల కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని స్టేషన్ పైన నిల్వచేసి ఉంచారు. స్టేషన్ చుట్టూ గంజాయి వాసన రావడంతో బస్తాలను లోపలికి మార్చాలని అధికారులు నిర్ణయించారు. బస్తాలు మార్చేందుకు స్టేషన్లో వివిధ కేసుల్లో అరెస్టై ఉన్న నిందితులకు ఆ పని అప్పగించారు.
వారిలో ముగ్గురు వ్యక్తులు ఇదే అదునుగా భావించి ఓ గంజాయి బస్తాను స్టేషన్ బయటకు తీసుకెళ్లారు. బస్టాండ్ సమీపంలోకి వెళ్లిన తర్వాత పోలీసుల అలజడిని గమనించి దానిని అక్కడే వదిలేశారు. గంజాయి వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బస్టాండ్ పట్టణంలోని స్టేషన్ పరిధిలో ఉండటంతో ఇంత పట్టపగలు గంజాయి ఎక్కడ్నుంచి వచ్చిందంటూ స్థానికులు మల్లగుల్లాలు పడ్డారు. బస్తాపై కేసు నెంబరు ఉండటంతో ఇది తమ గ్రామీణ పోలీస్ స్టేషన్కు సంబంధించినదని స్థానికులకు అర్థమైంది.
దీంతో ఈ విషయం ఆ ప్రాంతమంతా వ్యాపించింది. దీంతో విషయం తెలుసుకున్న ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రెండు స్టేషన్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. విచారణ అధికారిగా ఏఎస్పీ అనిల్ కుమార్ను నియమించారు. గంటల వ్యవధిలోనే కేసు విచారణను ఏఎస్పీ ముగించారు. సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందంటూ ఉన్నతాధికారులకు నివేదిక అందించారు.
గంజాయి నిందితులకు సహకరించిన పోలీసు.. ఇటీవల అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన పోలీసు అధికారి.. గంజాయి రవాణాకు సహకరించారు. నిందితులను ఆయన పట్టుకోవడమే కాకుండా.. వారితో బేరం కుదుర్చుకున్నారు. దీంతో గంజాయి రవాణాకు సహకరించారనే అభియోగాలపై ఆయనపై కేసు నమోదైంది. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
ఇటీవల అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెం ఎస్సై సత్తిబాబు ఆధ్వర్యంలో గంజాయి లోడుతో వస్తున్న ఓ కారును పోలీసులు పట్టుకున్నారు. అయితే నిందితులతో ఒప్పందం కుదుర్చుకున్న ఎస్సై.. వారిని అదుపులోకి తీసుకుండా వదిలేశారు. కాగా.. అదే కారును నెల్లూరు జిల్లాలో ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. దీంతో తీగ లాగితే డొంకంతా కదిలినట్లుగా.. ఎస్సై సత్తిబాబు తమకు సహకరించినట్లుగా నిందితులు ఎస్ఈబీ అధికారులతో తెలిపారు. తర్వాత ఏం జరిగిందంటే?.. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.