గుంటూరు జిల్లా మహిళపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఘటనాస్థలాన్ని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ పరిశీలించారు. ఈ ఘటనలో ఏడుగురు అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. మేడికొండూరు, సత్తెనపల్లి మండలాల పాత నేరస్థులను అనుమానితులుగా భావించిన పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. ఘటనా స్థలానికి 6 కిలోమీటర్ల దూరంలో కొత్తగా శీతల గిడ్డంగి నిర్మాణం జరుగుతోంది. గురువారం ఉదయం ఘటనాస్థలానికి వెళ్లిన జాగిలం ఆ శీతలీకరణ కేంద్రం వైపు వెళ్లి ఆగింది. అందులో ఒడిశా, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వారితో పాటు స్థానికులు కూడా పని చేస్తున్నారు. వారిలో 20 మంది నుంచి పోలీసులు వేలిముద్రలు సేకరించారు.
ఇదీ చదవండీ.. గోదావరికి పెరుగుతున్న వరద ఉద్ధృతి.. జలదిగ్బంధంలో ముంపు గ్రామాలు