రాజధాని ఎక్కడ ఉండాలనే విషయంలో జోక్యం చేసుకునే హక్కు పార్లమెంటుకు ఉందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము పార్లమెంటులో పోరాటం చేస్తుంటే.. చంద్రబాబుపై సీబీఐ కేసు పెట్టాలని వైకాపా ఎంపీలు పార్లమెంటు బయట ధర్నా చేశారని దుయ్యబట్టారు.
పరిపాలన రాజధాని, కోర్టు ఒక్కచోట ఉంటేనే పాలన సజావుగా సాగుతుందని గల్లా జయదేవ్ అభిప్రాయపడ్డారు. మూడు రాజధానులతో ఖర్చు కూడా మూడు రెట్లు పెరుగుతుందన్నారు. గుంటూరు పార్లమెంటు తెదేపా అధ్యక్షుడిగా శ్రావణ్ కుమార్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఎంపీ గల్లా జయదేవ్ పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరుగుతాయనే చర్చ నడుస్తోందని గల్లా జయదేవ్ అన్నారు. 2022లో ఎన్నికలు జరుగుతాయని సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు ఎంపీ గల్లా జయదేవ్ పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: క్వారీ గుంతల్లో ఈతకు దిగి ముగ్గురు చిన్నారులు మృతి