ETV Bharat / state

బాలుడిపై వీధి కుక్కల స్వైరవిహారం.. తప్పించుకునేందుకు ప్రయత్నించినా.. - కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడి మృతి వార్తలు

FOUR YEARS BOY DIED IN DOGS ATTACK : ఓ బాలుడిపై వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఒంటరిగా వెళ్తున్న చిన్నారిపై అతి క్రూరంగా దాడి చేశాయి. కుక్కల నుంచి కాపాడుకోవడానికి తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కకపోవడంతో.. వాటికి ఆహారమైపోయాడు. ఈ హృదయ విదారక ఘటన తెలంగాణలో జరిగింది.

FOUR YEARS BOY DIED IN DOGS ATTACK
FOUR YEARS BOY DIED IN DOGS ATTACK
author img

By

Published : Feb 21, 2023, 12:16 PM IST

Updated : Feb 21, 2023, 3:56 PM IST

FOUR YEARS BOY DIED IN DOGS ATTACK : అభం శుభం తెలియని నాలుగేళ్ల బాలుడు..! సెలవు రోజు కావడంతో ఆటవిడుపుగా ఉంటుందనే ఆలోచనతో తండ్రి కొత్తతావుకు తీసుకెళ్తే ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు. తండ్రి పని చేసుకుంటుండగా ఒక్కడే పక్కనే ఉన్న అక్క దగ్గరికి వెళ్లాలనుకున్నాడు. ఉన్నట్టుండి వీధి కుక్కలు దాడిచేయడంతో.. తప్పించుకునేందుకు శక్తి మేర ప్రయత్నించాడు. జంతువులను వేటాడినట్టుగా కుక్కలన్నీ ఆ చిన్నారిపై అన్ని వైపుల నుంచి దాడిచేయడంతో నిస్సహాయంగా శరీరాన్ని వాటికి అప్పగించి ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక ఘటన తెలంగాణలోని అంబర్‌పేట్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లా ఇందల్‌వాయి మండల కేంద్రానికి చెందిన గంగాధర్‌ నాలుగేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వలస వచ్చాడు. ఛే నంబరు చౌరస్తాలోని ఓ కారు సర్వీస్‌ సెంటర్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. భార్య జనప్రియ, ఆరేళ్ల కుమార్తె, కుమారుడు ప్రదీప్‌లతో కలిసి బాగ్‌అంబర్‌పేట ఎరుకుల బస్తీలో నివాసం ఉంటున్నాడు. ఆదివారం సెలవు కావడంతో పిల్లలిద్దర్నీ వెంటబెట్టుకుని తాను పనిచేస్తున్న సర్వీస్‌ సెంటర్‌ వద్దకు తీసుకెళ్లాడు. కుమార్తెను పార్కింగ్‌ ప్రదేశం వద్ద ఉన్న క్యాబిన్‌లో ఉంచి, కుమారుడిని సర్వీస్‌ సెంటర్‌ లోపలికి తీసుకెళ్లాడు.

కుమారుడు ఆడుకుంటూ ఉండగా మరో వాచ్‌మెన్‌తో కలిసి పనిమీద మరో ప్రాంతానికి వెళ్లాడు. కాసేపు అక్కడ ఆడుకున్న ప్రదీప్‌.. తర్వాత తన అక్క కోసం నడుచుకుంటూ వెళ్తుండగా వీధి కుక్కలు వెంటపడ్డాయి. భయపడిన బాలుడు వాటి నుంచి తప్పించుకునేందుకు అటు ఇటూ పరుగులు తీసినా అవి వదల్లేదు. ఒకదాని తర్వాత ఒకటిగా బాలుడిపై దాడిచేశాయి. ఒక దశలో ఓ కుక్క కాలు..మరొకటి చేయి నోటకరచుకుని చెరోవైపు లాగడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. తమ్ముడి ఆర్తనాదాలు విని అక్కడికి వచ్చిన ఆరేళ్ల సోదరి.. పరుగున వెళ్లి తండ్రికి సమాచారమిచ్చింది. ఆయన వచ్చి అదిలించడంతో కుక్కలు బాలుడిని వదిలేశాయి. తీవ్ర గాయాలపాలైన కుమారుడిని తండ్రి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 21, 2023, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.