తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు గుంటూరు జిల్లా వినుకొండలోని తన నివాసంలో నిరసన దీక్ష చేపట్టారు. శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు అనుమతించకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా బాధితులు, వారి సహాయకులకు భోజనం సరఫరా, ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహణ కోసం అనుమతి కోరి పద్నాలుగు రోజులైంది. దీనిపై అధికారులు స్పందించకపోవటంతో ఆంజనేయులు నిరసనకు దిగారు. ఆహార సరఫరాను అడ్డుకుంటున్నారంటూ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై మండిపడ్డారు.
ఇదీ చదవండి: రంగబయలులో పాడేరు ఐటీడీఏ పీవో వెంకటేశ్వరన్ ఆకస్మిక పర్యటన
నివాసంలోనే మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు నిరసన
గుంటూరు జిల్లా వినుకొండలోని శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలకు అనుమతి కోరి రెండు వారాలు గడిచింది. అయినా.. అనుమతులపై అధికారులు స్పందించకపోవటంతో తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు నిరసన చేపట్టారు.