ETV Bharat / state

పురుగులమందు తాగి కౌలురైతు ఆత్మహత్య

గుంటూరు జిల్లా కొత్తసొలసలో పురుగుల మందు తాగిన రైతు... ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు.

కౌలురైతు
author img

By

Published : Jul 12, 2019, 10:41 PM IST

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొత్త సొలసలో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుమందు తాగిన మలినేని వెంకటేశ్వర్లు.. ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రెండు ఎకరాల సొంత భూమి ఉన్నా... సాగుకు పనికిరాని పరిస్థితుల్లో... సంక్రాంతిపాడుకు చెందిన రైతుల వద్ద 10 ఎకరాల భూమిని... ఎకరం రూ18 వేల చొప్పున కౌలుకు తీసుకున్నాడు. గత నాలుగు సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నా... నష్టాలే మిగులుతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితితో వెంకటేశ్వర్లు నష్టపోయాడు. ఈ ఏడాది సాగు చేసేందుకు డబ్బుల్లేక ..గతంలో చేసిన అప్పులు తీర్చే అవకాశం కనిపించక.. పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి ఓప్రైవేటు వైద్యశాలకు తరలించినా.. ఫలితం లేకపోయింది. మృతునికి భార్య కోటేశ్వరమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఇది కూడా చదవండి.

రాష్ట్ర నాయకుడికి జాతీయ స్థాయిలో కీలక పదవి

Bengaluru, July 12 (ANI): Karnataka Chief Minister HD Kumaraswamy on Friday said that he is ready to seek the trust vote to prove his majority on the floor of the assembly.
While talking to reporters, Kumaraswamy said, "Whatever issue is there, I will face on the floor of the house'. Earlier, in the first sitting of Monsoon session in Vidhana Soudha, HD Kumaraswamy asked Speaker KR Ramesh Kumar to fix a date and time for the same."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.