గుంటూరు జిల్లా తెనాలిలో బ్రాహ్మణ కుటుంబంపై వైకాపా నేత, మార్కెట్ యార్డ్ ఛైర్ పర్సన్ భర్త ఎలవర్తి సాంబశివరావు దాడి చేశారు. స్థలం వివాద విషయంలో చంద్రమోహన్‌పై కత్తి, కర్రలతో దాడి చేశారు. చంద్రమోహన్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడుని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్.. ఆసుపత్రిలో బాధితుడిని పరామర్శించారు.
ఇదీ చదవండి : 'జగన్ పాలనంతా అప్పులమయం... రోడ్లన్నీ గుంతలమయం'