ETV Bharat / state

ప్రతిపక్షం గొంతునొక్కి...ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారు

శాసనసభలో ప్రతిపక్షం గొంతునొక్కి..ప్రజాసమస్యలపై మాట్లాడకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చంద్రబాబు ఆరోపించారు. రైతు సమస్యలపై మాట్లాడేందుకు సమయం అడిగినా... వేరే చర్చలు చేపట్టి తెదేపా సభ్యులపై నిందలు వేస్తున్నారని అన్నారు.

ప్రతిపక్షం గొంతునొక్కి...ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారు : చంద్రబాబు
author img

By

Published : Jul 24, 2019, 7:27 PM IST

ప్రతిపక్షం గొంతునొక్కి...ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారు : చంద్రబాబు

అసెంబ్లీలో ప్రతిపక్షనేతల మైకులు కట్ చేసి...మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న తెదేపా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారన్నారు. సభలో మాట్లాడే స్వేచ్ఛను ఇవ్వకుండా మైకులు ఆపేస్తున్నారని అన్నారు. 45 ఏళ్లకే పింఛను ఇస్తామని హామీ ఇచ్చిన వైకాపా.. ఇప్పుడు మాట మార్చిందన్నారు. ఆ అంశంపై చర్చించమంటే...తమపై ఎప్పుడో జరిగిన కృష్ణా, గోదావరి పుష్కరాలపై చర్చ చేపట్టి తెదేపాపై నిందలు వేస్తున్నారన్నారు. సభను ప్రజాస్వామ్యబద్ధంగా, హుందాగా నడపాలన్నారు. మాజీ ముఖ్యమంత్రిపై చర్చ జరిగినపుడు చెప్పుకునే సమయం ఇవ్వాలన్న సభా గౌరవాన్ని పాటించలేదన్నారు. సమాధానం చెప్పేందుకు సమయం ఇవ్వకుండా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారన్నారు చంద్రబాబు.

మాట మార్చారు..మడం తిప్పారు
రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.9 వేలు ఇస్తామని తెదేపా హామీ ఇచ్చిందని చంద్రబాబు అన్నారు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కలిపి రూ.15 వేలు ఇస్తామని చెప్పామన్నారు. ప్రతి ఒక్క రైతుకు రూ.12,500 ఇస్తామని వైకాపా మేనిఫెస్టోలో పెట్టి..ఇప్పుడు రాష్ట్రం రూ.6,500, కేంద్రం రూ.6 వేలు కలిపి రూ.12,500 ఇస్తామని మాట మార్చారన్నారు.

ఇసుక దొరక్క ఆందోళనలు
జగన్‌ ప్రవర్తనపై వైఎస్‌ గతంలో ఏం అన్నారో హరగోపాల్ చెప్పిన వీడియోను చంద్రబాబు ప్రదర్శించారు. రాష్ట్రాన్ని భయభ్రాంతులకు గురి చేయాలని వైకాపా చూస్తుందన్నారు. రాష్ట్రంలో ఇసుక ఎక్కడా దొరకట్లేదని..భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కి ఆందోళ చేపట్టే పరిస్థితులు వచ్చాయన్నారు. అమరావతి ప్రాజెక్టును సర్వనాశనం చేసి, ప్రపంచ బ్యాంకు, ఏఐఐబీలు వెనక్కిపోయేలా చేశారని చంద్రబాబు విమర్శించారు.

ప్రాజెక్టులు పూర్తి చేయడం తప్పా?
2009లో విద్యుత్‌ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచినా...వైఎస్‌ చనిపోయిన తర్వాత ఆ ప్రాజెక్టు 2012కు వాయిదా పడింది. ప్రభుత్వం వచ్చాక 8 గ్రామాల్లో బాధితులకు రూ.115 కోట్లు ఇచ్చామన్నారు. చిత్తశుద్ధితో ప్రాజెక్టులు పూర్తి చేయడం తప్పా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏదోవిధంగా బురదజల్లాలి.. తెదేపాపై నెపం వేయాలని వైకాపా ప్రయత్నిస్తుందన్నారు. వైఎస్‌ హయాంలో జరిగిన తప్పుకు రూ.2500 కోట్లు పోలవరం ప్రాజెక్టుకు అదనంగా చెల్లించామన్నారు.

ఇదీ చదవండి : నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా...స్థానిక రిజర్వేషన్లు: సీఎం

Intro:ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా కేంద్రం పర్లాఖెముండిలో గల అర్దనారీశ్వర ఆలయంలో నాగుపాము హల్చల్ చేసింది. ఉదయం భక్తులు పూజలు చేస్తున్న సమయంలో ఆలయంలోకి నాగుపాము వచ్చింది ఆలయంలో గల తాబేళ్లు తో కొంత సమయం ఆడుతూ భక్తులకు దర్శనమిచ్చారు ఈ సంఘటన చూసి నాగదేవతకు పూజలు చేశారు అనంతరం పాము బయటకు వెళ్ళంది.Body:పConclusion:ఫ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.