కేంద్ర ప్రభుత్వ పథకాల రూపకల్పన అమలు కోసం రాష్ట్రంలో ఆర్థిక సర్వే నిర్వహించనున్నట్లు జాతీయ గణాంక శాఖ ఏపీ డిప్యూటీ డైరక్టర్ జనరల్ కిరణ్ కుమార్ వెల్లడించారు. 2030కల్లా దేశంలో పేదరికాన్ని నిర్మూలించాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ ఏడాది చివరి వరకూ సర్వే చేయనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై సమాచారం సేకరించనున్నట్లు వివరించారు. దీనికోసం తమ సిబ్బంది ఇళ్లకు వచ్చినప్పుడు సహకరించి...అవసరమైన సమాచారం ఇవ్వాలని కోరారు. సర్వేలో భాగంగా తమ సిబ్బందికి ఎలాంటి ధృవపత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా ఒక యాప్ రూపొందించామని.. ప్రజలు ఇచ్చే సమాచారాన్ని ట్యాబ్లో నమోదు చేస్తామని వివరించారు. ఈ సమాచారం ఆధారంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తుందని చెప్పారు.
ఇదీ చదవండి: