గుంటూరు జిల్లాలో పూల రైతులతో కరోనా కన్నీళ్లు పెట్టిస్తోంది. జిల్లా నుంచి హైదరాబాద్, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గుంటూరు నగరాలకు రైళ్లు, వాహనాల్లో పూలు ఎగుమతి చేస్తుంటారు. ఐదు వేల కుటుంబాలు పూర్తిగా పూల సాగు, వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్నారు.
తీర ప్రాంతంలోని పూల సాగు ఎక్కువగా జరిగే గ్రామాలకు సరిహద్దులోనున్న చీరాలలో కరోనా కేసులు నమోదు కావటంతో రెడ్‌జోన్‌గా ప్రకటించారు. చీరాల, పరిసర గ్రామాల నుంచి కూలీల రాక పూర్తిగా నిలిచిపోయింది. ఇతర ప్రాంతాల నుంచి తోటల్లో పూలు కోయడానికి కూలీలు సైతం రావటం లేదు. కొంత మంది రైతులు స్వయంగా పూలు కోసి సమీపంలోని పట్టణాలకు తీసుకెళ్లి కొంతమేర విక్రయిస్తున్నారు. ఎనభై శాతం తోటల్లో పూలు ఉండిపోయి రాలిపోతున్నాయి. వెదుళ్లపల్లి మార్కెట్‌లో కొనుగోలు చేయడానికి వ్యాపారులు, మహిళలు రావడం లేదు. పూలను ఒక రోజు మించి నిల్వ చేయడానికి అవకాశం లేదు. ఉష్ణోగ్రతలు పెరిగిన కారణంగా 12 గంటలకే వాడిపోతున్నాయి. ఉగాది, శ్రీరామనవమి పండగల సమయంలో పూలకు మంచి డిమాండ్ ఉంటుంది. కరోనా మహమ్మారి కారణంగా ఈసారి పండగల సమయంలో వాటి వినియోగం తగ్గింది. గత పది రోజుల్లో రైతులు రూ.లక్షల్లో నష్టపోయారు. మల్లెపూలు, కనకాంబరాలు, లిల్లీ, సన్నజాజులు, చామంతి, గులాబీలు తోటలకే పరిమితమై ఎండిపోతున్నాయి.
ప్రభుత్వమే ఆదుకోవాలి
ఎకరాకు రూ.లక్ష వరకు ఆదాయం వస్తోందని ఓ రైతు తెలిపారు. మల్లెలు, కనకాంబరాల సీజన్‌లో కరోనా దెబ్బకొట్టిందని వాపోయారు. లాక్‌డౌన్ కారణంగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయని అన్నారు.
కూలీలు అందుబాటులో లేరని శ్రీనివాసరెడ్డి అనే రైతు అన్నారు. ఉన్న వారికి ఎక్కువ కూలీ చెల్లించి కోయిస్తున్నా కొనుగోలు చేయడానికి వ్యాపారులు రావటం లేదని తెలిపారు. తోటల్లోనే పూలు వదిలేస్తున్నామని ఆవేదన వ్యాక్తం చేశారు. ఉద్యాన రైతులకు సాయం చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్ననారు.
ఇదీ చదవండి: