కృష్ణానదికి వరద ఉద్ధృతితో గుంటూరు జిల్లాలో కొండవీటి వాగు పొంగిపొర్లుతోంది. అమరావతి మండలం పెదమద్దూరు వద్ద కొండవీటి వాగు ఉద్ధృతితో విజయవాడ - అమరావతి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మిర్చి, పత్తి పంట పొలాలు నీట మునిగాయి. పులిచింతల నుంచి సుమారు 6 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహంతో ప్రకాశం బ్యారేజీపై ఒత్తిడి పెరిగింది. ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ వద్ద 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం వద్ద కృష్ణా నది పరివాహక ప్రాంతల మత్స్యకారులు, రైతులను సురక్షిత ప్రాంతాలను తరలించారు. ఈ అర్ధరాత్రికి కృష్ణానది ప్రవాహం మరింత ఉద్ధృతమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 6,923 కరోనా కేసులు, 45 మరణాలు నమోదు