ETV Bharat / state

కృష్ణా పరివాహక గ్రామాలను వీడని ముంపు - కృష్ణా తీర గ్రామాల్లో వరద న్యూస్

గుంటూరు జిల్లాలోని కృష్ణా పరివాహక ప్రాంత గ్రామాలను వరద ముంపు వీడలేదు. దుగ్గిరాల, కొల్లిపొర, కొల్లూరు.. ఇతర గ్రామాల్లో వరద తీవ్రత కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజికి 6 లక్షల క్యూసెక్కుల వరద వస్తోందని అధికారులు తెలిపారు. వరద ఉద్ధృతికి పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. పంటలు పూర్తిగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు.

Flood effects in guntur dist
Flood effects in guntur dist
author img

By

Published : Oct 17, 2020, 8:14 PM IST

గుంటూరు జిల్లాలో కృష్ణా తీర ప్రాంతాలు ముంపు ముప్పు నుంచి బయటపడలేదు. దుగ్గిరాల, కొల్లిపొర, కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల పరిధిలోని గ్రామాల్లో తీవ్రత అలాగే ఉంది. ప్రకాశం బ్యారేజికి 9 లక్షల క్యూసెక్కులు వరద వస్తుందన్న అధికారుల ప్రకటనతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అయితే... వరద తీవ్రత తగ్గటంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం 6 లక్షల క్యూసెక్కుల మేర వరద ప్రకాశం బ్యారేజి నుంచి కొనసాగుతోంది.

నాలుగు రోజులుగా వచ్చిన వరదతో నదీ తీర గ్రామాల్లో పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. పంట చేతికి దక్కే అవకాశాలు కనిపించటం లేదని రైతులు వాపోతున్నారు. నీట మునిగిన పైర్లను చూసి రైతులు కన్నీరు పెడుతున్నారు. వంగ, చామంతి తోటలు పూర్తిగా నాశనమయ్యాయి. కొన్ని చోట్ల గ్రామాల్లోకి కూడా నీరు చేరింది.

కొల్లూరు మండలంలోని లంక గ్రామాల్లో పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. లోతట్టున నివసించేవారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. చుట్టూ ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. దుగ్గిరాల మండలంలో వరదముంపున పడిన కంద పొలాలు రైతులు తొలగిస్తున్నారు. పంట అలాగే ఉంచితే పూర్తిగా కుళ్లిపోతుందని... ఇపుడు తవ్వితే కొంతైనా ఫలసాయం వస్తుందని రైతులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:

ధర్మానను తప్పించండి: రాష్ట్ర కార్మిక సంక్షేమ సంఘం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.