తెనాలిలో ఫ్లెక్సీ వివాదం - Flexi friction in Tenali
గుంటూరు జిల్లా తెనాలిలో ఓ ఫ్లెక్సీ వివాదస్పదమైంది. మార్కెట్ సెంటర్లో అన్నా క్యాంటీన్‌కు జై అమరావతి ఫ్లెక్సీలను తెదేపా కార్యకర్తలు ఏర్పాటు చేశారు. కొద్దికాలంగా అదే చోట వైకాపా ఫ్లెక్సీలు ఉన్నాయి. మున్సిపల్ అధికారులు జై అమరావతి ఫ్లెక్సీలను తొలగించి... వైకాపా ఫ్లెక్సీలను ఉంచారు. అది తెలుసుకున్న తెదేపా కార్యకర్తలు అక్కడి చేరుకుని ధర్నా చేశారు. రెండు నెలలుగా కట్టిన ఫ్లెక్సీలు తీయకుండా.... ఇప్పుడు కట్టిన ఫ్లెక్సీలను ఎందుకు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేని ఫ్లెక్సీలు తొలగించేలా ... మున్సిపల్ కమిషనర్ నుంచి ఆదేశాలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడం వల్ల వివాదం సద్దుమణిగింది.
Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబరు 7 6 8 మొబైల్ నెంబరు 9 9 4 9 9 3 4 9 9 3
Body:గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ సెంటర్లో అన్నా క్యాంటీన్ కు తెదేపా జై అమరావతి వైఎస్ఆర్సిపి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు మున్సిపల్ అధికారులు అమరావతి తొలగించి వైఎస్ఆర్సిపి ఫ్లెక్స్ లు ఉంచారు అది తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు నాయకులు అక్కడి చేరుకుని రెండు నెలలుగా కట్టిన ప్లెక్సీలు తీయకుండా మేము ఈరోజు కట్టిన ఫ్లెక్స్ లు తీసారా అన్న కాంటీన్ ముందు ఆరు గంటలపాటు ఆందోళన చేశారు పోలీసులు వచ్చి తెనాలిలో అనుమతి లేని పక్షంలో రేపు మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ తీసుకుని తలకి ఇస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది
బైక్ రాజేష్ ఒకటో పట్టణ సీఐ
Conclusion:గుంటూరు జిల్లా తెనాలిలో ఫ్లెక్సీ వివాదం