గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ప్రముఖ న్యాయవాది, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు అడుసుమల్లి ప్రతాప్ కుమార్.. నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య ,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతికి చిలకలూరిపేట బార్ అసోసియేషన్ సభ్యులు సంతాపం తెలిపారు.
నాదెండ్ల మండలం గణపవరం పంచాయతీ బిల్ కలెక్టర్ గా పనిచేసిన రణధీర్ (55).. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడ్డారు. ఆయనకు ఇటీవల కొవిడ్ సొకింది. కుటుంబ సభ్యులు గుంటూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ రణధీర్... నిన్న మృతి చెందారు. ఇదే మండలం సాతులూరు గ్రామానికి చెందిన 70 సంవత్సరాల వయసు పైబడిన ముగ్గురు వృద్ధులు కరోనాతో నరసరావుపేటలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. వారిలో ఒక మహిళ ఉన్నారు.
ఇదీ చదవండి: