Fishermen Problems: గుంటూరు జిల్లాలో అటవీ శాఖ అధికారులు దాడులు చేస్తున్నారంటూ మత్స్యకారులు ఆరోపించారు. మాచర్ల మండలం అనుపు కృష్ణా జలాశయం నుంచి.. శ్రీశైలం వెళ్లే జలమార్గంలో అధికంగా దాడులు జరుగుతున్నాయని వెల్లడించారు. సుమారు 200 మత్స్యకారుల కుటుంబాలు.. లారీల్లో పుట్టీలు, వలల్ని తీసుకుని ఉపాధి కోసం దూర ప్రాంతాలకు తరలివెళ్లాయని తెలిపారు.
అధికారుల వేధింపులతో ఉపాధి కోల్పోయామంటూ.. ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చొరవ తీసుకొని న్యాయం చేయాలని బాధిత మత్స్యకారులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:
విసిరితే లక్ష్యం చేరాల్సిందే... విలువిద్యలో కడప యువకుడి ప్రతిభ